పాఠశాల అభివృద్ధికి నిధులు సద్వినియోగం
మంచిర్యాలఅర్బన్: పాఠశాల అభివృద్ధి కోసం పీఎంశ్రీ కింద మంజూరైన నిధులు సద్విని యోగం చేసుకుని పనులు వేగవంతం చేయాలని డీఈవో యాదయ్య అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయలకు శిక్షణ నిర్వహించారు. రెండు దశల్లో ఎంపిక చేసిన 25 పీఎంశ్రీ పాఠశాలల్లో తరగతి గదులు, కిచెన్ గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్‌ఈడీ లైటింగ్, సైన్స్ ల్యాబ్, పలు రకాల పనులకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పా ఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలతో సమన్వ యం చేసుకుని సక్రమంగా నిధులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు శ్రీనివాస్, చౌదరి, సత్యనారాయణమూర్తి, డీఈ శ్రీనివాస్, ఏఈలు, రిసోర్సు పర్సన్ హన్మండ్లు, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment