ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలన
భీమిని: కన్నెపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీఎచ్‌సీ) నిర్మాణానికి అనువై న స్థలాన్ని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ గురువారం పరిశీలించారు. 2016లో కన్నెపల్లి మండలం ఏర్పడినప్పటికీ పీహెచ్‌సీ ఏర్పాటు కాలే దు. గత ఏడాది కన్నెపల్లి నుంచి బోగట్టా గ్రా మానికి వెళ్లే దారి పక్కన ప్రభుత్వ స్థలాన్ని గు ర్తించడంతో గత అక్టోబర్ 3న బెల్లంపల్లి ఎమ్మె ల్యే గడ్డం వినోద్ భూమి పూజ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో కన్నెపల్లి స బ్‌స్టేషన్, నూతన పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్ర భుత్వ స్థలాన్ని జిల్లా వైద్యాధికారి పరిశీలించా రు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామ ని తెలిపారు. సీఎచ్‌ఓ జలపతి, పాక్స్ వైస్ చైర్మ న్ రాజన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment