రూ.500 కోట్ల బడ్జెట్‌.. సూర్య, జాన్వీ కపూర్‌ జోడీ! | Janhvi Kapoor Alongside with Suriya in Mahabharat Film | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పాన్‌ ఇండియా సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు!

Published Thu, Jan 18 2024 7:59 AM | Last Updated on Thu, Jan 18 2024 9:27 AM

Janhvi Kapoor Alongside with Suriya in Mahabharat Film - Sakshi

వరుస విజయాలతో జోరు మీదున్న నటుడు సూర్య. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కంగువా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనితో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రంలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ హీరో బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ దర్శకుడు మహాభారత ఇతిహాసాన్ని రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పాన్‌ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. మహాభారత చిత్రంలో సూర్య ఏ పాత్రను పోషించనున్నారన్నది వెల్లడి కాలేదు.

కానీ ఆయనకు జంటగా అందాల రాశి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది.

చదవండి: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లో 21 మూవీస్ రిలీజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement