మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన మరో సినిమా ఓటీటీలో విడుదలవుతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కీర్తి సురేశ్ ముఖ్య పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి అనే సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకానుందట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో ‘గుడ్ లక్ సఖి’ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో చర్చలు కూడా జరిపారట. త్వరలోనే జీ 5 లో ‘గుడ్ లక్ సఖి’స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గతంలో కీర్తి నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.
ఇక ‘గుడ్ లక్ సఖి’విషయానికి వస్తే.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వ వహించారు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సురేశ్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment