నార్త్ నుంచి సౌత్ దాకా ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం) హవా నడుస్తోంది. బాలీవుడ్‌లో వంద కోట్లు దాటేసిన ఈ చిత్రం ఇప్పటివరకు ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ నటుడు మకరంద్ దేశ్‌పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అక్కడిని వెళ్లాను. అప్పటికే నాకోసం రామ్‌చరణ్, రాజమౌళి ఎదురుచూస్తున్నారు. నేను వెళ్లగానే చరణ్ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
బాహుబలితోనే దేశ ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు రాజమౌళి. ఆయన కష్టస్వభావి, ముక్కుసూటి మనిషి. ఎన్నిరోజులనేది నేను చెప్పలేను కానీ నా సినిమాలో మీరుండాలని ఆయన నాతో అన్నాడు. సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు కానీ చాలావరకు నా సన్నివేశాలు కట్ చేశారు. నిజానికి రాజమౌళి సర్ ముందు ఒక చిన్న సినిమా తీద్దామనుకున్నాడు. అది కూడా లవ్ స్టోరీ. కానీ రాజమౌళి భార్య నీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది చేయమని సూచించింది. దీంతో ఆయన ఆర్‌ఆర్‌ఆర్ మీద ఫోకస్ చేశాడు. అతడి ఆలోచనలు పెద్దవి, అందుకోసం ఎంతో కష్టపడ్డాడు కూడా! అనుకున్నట్టుగానే ఆ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.
చదవండి: బాలీవుడ్‌లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్ మాజీ ప్రేయసి
ఎన్టీఆర్ భుజాలపై రామ్‌చరణ్ ఎక్కి ఫైట్ చేసే సన్నివేశం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. సెట్స్‌లోకి నేను వెళ్లగానే ఎన్టీఆర్ లేచి నిలబడి నన్ను కూర్చోమనేవారు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడేవాడు. తారక్ ట్రక్‌లో నుంచి క్రూరమృగాలతో పాటు బ్రిటీష్ సౌధంలోకి దూకే సీన్ అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు మకరంద్ దేశ్‌పాండే.
Comments
Please login to add a commentAdd a comment