సాయిధరమ్‌తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ 25న ఈ సినిమా విడుదల కానుంది. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం కావడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డా్రు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. (చెప్పింది చేసుకుంటూ వెళ్లడమే! )
ఈ సినిమాతో సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తమన్ స‍్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘నో పెళ్లి’ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం. ఈ సినిమా అనంతరం దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (పెళ్లి వార్తలను కొట్టిపారేసిన సాయిధరమ్ తేజ్ )
#StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020
Comments
Please login to add a commentAdd a comment