Prabhas Review On RRR Movie: I Got Tears While Watching 10 Scenes, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas Review On RRR: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆ సీన్స్‌ హైలైట్‌, కొన్ని సన్నివేశాల్లో ఏడ్చేశాను

Published Sat, Apr 16 2022 2:46 PM | Last Updated on Sat, Apr 16 2022 3:16 PM

Prabhas Review On RRR Movie: I Got Tears While Watching 10 Scenes - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. మార్చి 25న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా అద్భుతంగా ఉందంటూ సౌత్‌ నుంచి బాలీవుడ్‌ దాకా అందరూ కొనియాడారు. అయితే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మాత్రం ఈ సినిమాపై ఆలస్యంగా స్పందించాడు.

తాజాగా ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చూశాను. చాలా బాగా నచ్చింది. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.1100 కోట్లు సాధించే దిశగా వెళ్తోంది. ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చింది. దాదాపు 10 సన్నివేశాల్లో నా కళ్లలో నీళ్లు తిరగ్గా... 50 సీన్లు నన్ను కట్టిపడేశాయి. ఈ సినిమా చాలా బాగుంది' అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్‌..

మీ లిప్‌ సైజ్‌ ఎంత ?.. శ్రుతి హాసన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement