![Telugu Director Palik New Movie Periodical Concept - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/11/NEW-MOVIE.jpg.webp?itok=shdW8VWI)
తెలుగు దర్శకుడు పాలిక్ తీస్తున్న కొత్త సినిమా.. ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో సోమవారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్.. ముహూర్తపు న్నివేశానికి క్లాప్ కొట్టారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అంద చేయగా దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ఉంటాయని నిర్మాతల్లో ఒకరైన భోగి సుధాకర్ చెప్పుకొచ్చారు. హీరోహీరోయిన్‌గా చేయబోతున్న ప్రమోద్, మోహన సిద్ధి, శ్రీమన్ మాట్లాడుతూ.. ఈ కథ చాలా బాగుంటుంది. అందుకే ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నామని అన్నారు. ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథ ఆధారంగా తీయబోయే పీరియాడిక్ మూవీ. ఇందులో బాహుబలి ప్రభాకర్ దొర పాత్రలో నటిస్తున్నారు అని దర్శకుడు పాలిక్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే)
Comments
Please login to add a commentAdd a comment