క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలి
ములుగు రూరల్: ఆన్‌లైన్‌లో జిల్లాస్థాయి క్రీడాపోటీలకు దరఖాస్తులు చేసుకున్న క్రీడాకారులు కేటాయించిన తేదీలలో మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో హాజరు కావాలని జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో నేడు, రేపు నెట్‌బాల్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ పోటీలకు, 22వ తేదీన రెజ్లింగ్, సైక్లింగ్, జోడో బిల్లెట్స్ అండ్ స్మోకర్స్ హాజరు కావాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్న వారిని మాత్రమే రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు. అదే విధంగా సీఎం కప్–2024 కరాటే క్రీడల కన్వీనర్‌గా జగ్గన్నపేటకు చెందిన అజ్మీర రాజును నియమించినట్లు తెలిపారు. బండారుపల్లి గిరిజన భవన్‌లో రేపు కరాటే జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8500876033, 9440915293లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment