ఐక్యంగా పనిచేసి జిల్లాను ముందంజలో ఉంచాలి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుపర్చడంలో ఉద్యోగులు ఐక్యంగా పని చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టీఎన్జీఓస్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా మీ వెంట నేను ఉంటాను అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మేడి చైతన్య, రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ షఫీసర్కార్, కోశాధికారి భూక్య లాల్‌నాయక్, కుమారస్వామి, శ్రీధర్, రాంగోపాల్, సునీత, శ్రీవాణీ, సరిత, జైసింత, ప్రదీప్, అనిల్, ప్రశాంత్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాజు, భాస్కర్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
Comments
Please login to add a commentAdd a comment