బోనస్ ఆలస్యం
ములుగు రూరల్: తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు క్వింటాకు రూ. 2,320తో పాటు నిబంధనల మేరకు బోనస్ రూ.500 కలిపి చెల్లింపు చేపట్టాలి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన డబ్బుల్ని మూడు రోజుల నుంచి వారం రోజుల్లోపు చెల్లిస్తోంది. కానీ.. బోనస్ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం అవుతోంది. దీంతో కొంత మందికి మాత్రమే బోనస్ డబ్బులు ఖాతాలో పడి మరికొందరికి పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో మొత్తం వరి ధాన్యం సేకరణకు అధికారులు సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా వేశారు.
ఎదురుచూపులు
ములుగు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ప్రభుత్వం 204 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,21,152 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 70,813.400 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 50,338.680 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించింది.
కాగా.. ములుగు జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు రూ.13 కోట్ల 56 లక్షల రూపాయల బోనస్‌ను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. జిల్లాలో 70,813.400 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించగా..
ఇందులో ట్యాబ్ ఎంట్రీ 5 లక్షల 57 వేల 996 క్వింటాళ్లు మాత్రమే ఎంట్రీ అయ్యిందని అందుకు సంబంధించిన బోనస్ రూ. 27 కోట్ల 89 లక్షల 98 వేలు చెల్లించాల్సి ఉండగా.. 2లక్షల 86వేల 782 క్వింటాళ్లకు గాను రూ.14 కోట్ల 33లక్షల 91 వేల రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమయ్యింది.
చివరి దశకు చేరిన కొనుగోళ్లు
జిల్లాలో సేకరించిన సన్నధాన్యం 70,813 మెట్రిక్ టన్నులు
పెండింగ్ బోనస్ రూ.13.56 కోట్లు
ఎదురు చూస్తున్న అన్నదాతలు
Comments
Please login to add a commentAdd a comment