ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
●
● రైతు ఆత్మీయ భరోసా గొప్ప పథకమని.. దీని గురించి ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం వర్తించని వారు నిరాశ చెందకుండా ఉపాధి పనికి వెళ్లేలా అధికారులు సూచించాలని.. మరోసారి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే సొంత స్థలం లేని వారికి మలి దఫాలో ఇళ్లు వస్తాయని సర్ది చెప్పాలన్నారు.
● కొత్త పథకాల అమలులో అర్హుల ఎంపిక సమర్థవంతంగా జరగాలని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి సూచించారు.
● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా ప్రభుత్వ పథకాల వర్తింపులో అవకాశం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు.
● ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో టెక్నికల్, ప్రాక్టికల్ సమస్యలు తలెత్తుతున్నాయని.. క్షేత్రస్థాయిలో వడబోసిన జాబితాను గ్రామ సభలో పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు.
● మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటే స్క్రూట్నీ చేయాలని.. ఇళ్ల్లు ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి వెంటనే తొలగించాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అక్కడి ప్రభుత్వంతో చర్చించి జూరాలకు ఐదు టీఎంసీల నీటిని వదిలేలా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు.
● జర్నలిస్టులు కూడా ఇందిరమ్మ ఇళ్లు అడుగుతున్నారని, ఒకసారి పరిశీలించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
● ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ల్లను కేటాయించాలని అలంపూర్ ఎమ్మెల్యే
విజయుడు మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment