సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల పరిష్కారం
త్రిపురారం : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులను సత్వర పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. మంగళవారం త్రిపురారం, నిడమనూరు పోలీస్‌స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్‌స్టేషన్లలోని సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు, రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్‌డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్‌హెచ్‌ఓ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యాకలాపాలు, గంజాయి, జూదం, ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణను అరికడుతున్నామని చెప్పారు. కమ్యునిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ టీవీల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, హలియా సీఐ జనార్దన్‌గౌడ్, త్రిపురారం ఎస్‌ఐ ప్రసాద్, నిడమనూరు ఎస్‌ఐ గోపాల్‌రావు తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment