చిట్యాల మార్కెట్ పాలకవర్గం నియామకం
చిట్యాల : చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్‌పర్సన్‌గా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా వినోదమోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా నార్కట్‌పల్లికి చెందిన ఐతరాజు యాదయ్య డైరెక్టర్లుగా రెముడాల యాదయ్య, బూరుగు కృష్ణయ్య, గజ్జెల భాస్కర్, షేక్ కరీం సాబ్ (చిట్యాల), కోనేటి యాదగిరి (ఉరుమడ్ల), దుబ్బాక అరుణ వెంకట్‌రెడ్డి (నేరడ), కొండ ఎల్లయ్య (ఎలికట్టె), లెంకల విజయేందర్‌రెడ్డి (వనిపాకల), దారా యాదయ్య(గోపాలయపల్లి), తొడుజు వీరయ్య (బెండల్‌పహాడ్), బింగి కొండయ్య (తొండ్లాయి), నీరుడు రాంరెడ్డి (ఔరవాణి) ఎన్నికయ్యారు. వీరితో పాటుగా చిట్యాల పీఏసీఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, వ్యవసాయ శాఖ ఏడీలు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఈ పాలకవర్గం పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది. మార్కెట్ చైర్‌పర్సన్‌గా నియమాకమైన నర్రా వినోద మోహన్‌రెడ్డి గురువారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ చిట్యాల మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, పట్టణ అధ్యక్షుడు జడల చినమల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment