108ను సద్వినియోగం చేసుకోవాలి
కనగల్ : అధునాతన సౌకర్యాలతో కనగల్ మండలానికి కేటాయించిన అంబులెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కనగల్ మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను ప్రారంభించి మాట్లాడారు. మానిటరింగ్ వ్యవస్థతోపాటు, ఏదైనా పాయిజన్ కేసు వస్తే అంబులెన్స్‌లో చికిత్స అందించే విధంగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. అనంతరం సబ్ సెంటర్ల వారీగా మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పద్మ, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment