మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ : మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ కోరారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం విధులకు హాజరవుతూనే భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం 6వ రోజు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై.. సాయంత్రం డీఐఈఓ, డీఈఓకు వినతిపత్రాలు అందిచామని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకొని మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలని కోరారు. కార్యక్రమాల్లో ఖలీల్ అహ్మద్, సయ్యద్ సలీం, అక్కినెపల్లి శ్రీనివాస్, అనిల్కుమార్, భద్రయ్య, ఫసి అహ్మద్, కొండల్, వరలక్ష్మి వజీహ తబస్సుం, రవీందర్, విజయ్, లూర్దు రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment