వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
గడివేముల: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎస్‌ఏ పరీక్షలు 1, 2 లలోఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ బీఎస్ రామ్మోహన్‌రెడ్డిని డీఈఓ సన్మానించారు. ఉపాధ్యాయులతో సమావేశమై పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలో కేసీ కెనాల్ నీరు నిల్వ ఉండటాన్ని గమనించి.. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్‌ను కోరారు. డీఈఓ వెంట ఉర్దూ డీఐ హస్ముద్దీన్, ఎంఈఓ విమలావసుంధర దేవి, హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్ శ్రీనివాసులు ఉన్నారు.
డీఈఓ జనార్దన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment