పిల్లలు అలసిపోతారు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అశాస్త్రీయమైనది. విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే విద్యార్థులు అలసిపోతారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– సి.నాగరాజు ఎస్టీయూ రాష్ట్ర సహ అధ్యక్షుడు
ఆలోచన విరమించుకోవాలి
ఉన్నత పాఠశాలల పని వేళలు పెంచాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. గతంలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4:40 వరకు హైస్కూల్ పాఠశాలల పని వేళలు ఉండేవి. సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు మార్పు చేసింది. సాయంత్రం 5 గంటలకు పాఠశాల వదిలితే గ్రామాలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారు. విద్యార్థినులకూ భద్రత ఉండదు. – నగరి శ్రీనివాసులు,
ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment