ఏది పడితే అది పోస్టు చేయకూడదు
నేను పెట్టే పోస్టులను నా గ్రూపులో ఉన్న 60 నుంచి 70 శాతం మంది చూస్తున్నారు. ఇటీవల వరల్డ్ డయాబెటిస్ గురించి పోస్టు పెట్టాను. నాకు ఫోన్ చేసి షుగర్ గురించి వారికున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే గంటలకు పైగా సైక్లింగ్ చేసిన తర్వాత కలిగిన అనుభవం గురించి పోస్టు చేశాను. సైక్లింగ్ వల్ల లాభాల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చూస్తున్నారు కదా అని ఏది పడితే అది పోస్టు చేయకూడదు. అవగాహనతో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పోస్టు చేయాలి.
– డాక్టర్ ఎం. శ్రీకాంత్‌రెడ్డి,
డయాబెటాలజిస్టు, కర్నూలు
ప్రజల్లో అవగాహన పెంచడానికే..
ఇటీవల కాలంలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సోషల్ మీడియాల్లో కొందరు వ్యక్తులు వారికి అర్హత లేకపోయినా ఆరోగ్యం గురించి పలు రకాల పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక డాక్టర్‌గా బాధ్యత తీసుకుని నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ‘స్టేటస్’లో పోస్టులు పెడుతున్నాను. నేను నూతన విధానాల్లో చేసిన సర్జరీలు, విదేశాల్లో ఉన్న ఆధునిక వైద్య విధానాలు, మన దేశాల్లో రావాల్సిన ఆవశ్యకత, వివిధ రకాల జబ్బుల గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నాను.
– డాక్టర్ వసీం హసన్ రాజా,
సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు
వ్యాపార ప్రచారానికి
ఉపయోగపడుతోంది
నేను వ్యాపారవేత్తను. ఇందులో భాగంగా పలు రకాల వ్యాపారాలు చేస్తుంటాను. ఇందుకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తుంటాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూస్తున్న వాట్సాప్ స్టేటస్‌లోనూ పోస్టులు పెడుతున్నాను. దీనికి మంచి స్పందన వస్తోంది. నేను చేస్తున్న స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి పోస్టులు పెట్టాను. ఇటీవల రియల్ ఎస్టేట్ పోస్టులు స్టేటస్‌లో చూసి కొందరు క్లయింట్‌లు మావద్దకు వచ్చి కొనుగోలు చేశారు. సోషల్ మీడియాను ఎవరు ఏ విధంగా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది.
– పి. గోవర్దన్‌రెడ్డి, వ్యాపారి, కర్నూలు
●
Comments
Please login to add a commentAdd a comment