ప్రజా వినతులు నాణ్యతతో పరిష్కరించండి
నంద్యాల: ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్వీకరించిన 18 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఏపీ సేవా సర్వీసులను కూడా క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ముందు జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కార్యకలాపాలకు సంబంధించిన దస్త్రాలన్నీ ఈ – ఆఫీస్ ద్వారా సిగ్నేచర్ లేకుండా వస్తున్నాయని, ఈ – ఫైలింగ్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన పొంది ప్రతి ఫైలు ఈ–ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఎన్‌టీఆర్ భరోసా కింద నేడు పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆధార్ లేని గిరిజనులకు నోటరీ లేకుండా జనన ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అపార్ ఐడీ జనరేషన్ కోసం ఇంటర్ విద్యార్థులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించండి
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలు ప్రాంగణంలో చిరుధాన్యాల ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కాయగూరలు, ఆకు కూరల స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు, సేంద్రియ ఆహార ఉత్పత్తులను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు
జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment