5న కురువ వివాహ పరిచయ వేదిక
కర్నూలు(అర్బన్): స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు కురువ, కురుబ, కురుమ కులస్థుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు జిల్లా కురువ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. ఈ వేదికకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం స్థానిక కార్యాలయ ఆవరణలో విడుదల చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కురువ సామాజిక వర్గానికి చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ అవివాహిత పిల్లలకు వివాహాలు చేసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, మహిళా విభా గం అధ్యక్ష, కార్యదర్శులు టీ శ్రీలీల, కే అనితాలక్ష్మి, తేజశ్వి ని, నాయకులు కేసీ నాగన్న, బీ వెంకటేశ్వర్లు, కే ధనుంజయ, బీ రామక్రిష్ణ, తవుడు శ్రీనివాసులు, పాల సుంకన్న, బీసీ తిరుపాలు, పుల్లన్న, దివాకర్ పాల్గొన్నారు.
అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర రాజ ధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలులోని సీఆర్ భవన్‌లో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల వారికి అమరావతి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, నాగరాజు, బీసన్న పాల్గొన్నారు.
గణితం ప్రకారం ఆకర్షణీయమైన సంఖ్య 2025
కర్నూలు కల్చరల్: గణితం ప్రకారం 2025కు ప్రత్యేకత ఉందని ఇది ఆకర్షణీయమైన సంఖ్య అని ప్రముఖ గణిత ఉపాధ్యాయులు డి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. 45శ్రీ45=2025 ఒక వర్గ సంఖ్య, రెండు వర్గ సంఖ్యల లబ్దంగా కూడా దీన్ని రాయవచ్చన్నారు. మూడు సంఖ్యల వర్గంగా రాయగలిగిన ప్రత్యేక సంఖ్య కూడా అవుతుందన్నారు. 1936 (44శ్రీ44) తర్వాత వచ్చిన వర్గ సంఖ్య 2025 అన్నారు. 2025 (45శ్రీ45)తరువాత మళ్లీ ఇలాంటి వర్గ సంఖ్య 2116లో (46శ్రీ46) వస్తుందన్నారు. 2025ను మొదట 9 అంకెల ఘనాల (1శ్రీ3, 2శ్రీ3, 3శ్రీ3, 4శ్రీ3, 5శ్రీ3, 6శ్రీ3, 7శ్రీ3, 8శ్రీ3, 9శ్రీ3) మొత్తంగా రాయవచ్చన్నారు.
మహిళ ఆత్మహత్య
సంజామల: మండల పరిధిలోని ఆల్వకొండ గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెద్ద నరసింహుడు భార్య అబిగళ్ల గౌరమ్మ(50) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈక్రమంలో జీవితంపై విరక్తితో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కూమర్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment