కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి
కోవెలకుంట్ల: కనీవిని ఎరుగని డొక్కల కరువు సమయంలో ప్రజల ఆకలి తీర్చిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి దానకర్ణుడిగా కీర్తింపబడుతున్నారని వక్తలు కొనియాడారు. మంగళవారం పట్టణంలో ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో వెంగళరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ముందుగా బుడ్డా వెంగళరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి, రిటైర్డ్ హెచ్‌ఎం నారాయణస్వామి మాట్లాడుతూ 1860లో రాయలసీమలో సంభవించిన డొక్కల కరువు బీభత్సాన్ని గమనించిన బుడ్డా వెంగళరెడ్డి గంజి కేంద్రాలను ప్రారంభించి తన వద్ద ఉన్న ధాన్యంతో మూడేళ్లపాటు అన్నదానం చేశారన్నారు. బుడ్డా వెంగళరెడ్డి దానగుణం తెలుసుకున్న ఇంగ్లాడ్ రాణి విక్టోరియా మహారాణి ఢిల్లీ పిలిపించి రాజప్రతినిధుల సభలో ఆయనకు బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సూర్యచంద్రులుగా కొనియాడబడుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రకృతి పీఠం సభ్యులు పల్లె చంద్రశేఖర్‌రెడ్డి, ఏరాశి మహేశ్వరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, శివన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment