● అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు ● 2025కు ఘన స్వాగతం ప
కర్నూలు కల్చరల్: నూతన సంవత్సరం ప్రారంభమయ్యే క్షణాన ఆనందం మెరుపులా మెరిసింది. ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఆశలు.. ఆశయాలను నిజం చేస్తూ తమను విజయ పథాన నిలుపుతుందనే ఆకాంక్షలతో జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సంబరాలు మిన్నంటే వేళ నింగి నేల కాంతుల హేల.. మది నిండా మధుర స్మృతులతో 2024కు వీడ్కోలు.. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతాలు.. ఉప్పొంగిన ఉత్సాహంతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ.. అన్నీ మంచి శకునాలే అనుకుంటున్న జిల్లా ప్రజలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు. బాణాసంచా కాలుస్తూ కేకులు కట్ చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. నయా సాల్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొ ట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పత్తికొండ తదితర పట్టణాల్లో యువత సంతోషంగా గడిపారు. ఉత్సాహంతో 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకున్నారు.
కాలంలో కలిసిపోయిన మరో సంవత్సరం
కాలగర్భంలో మరో ఏడాది 2024 కలిసిపోయింది. నూతన సంవత్సరం 2025లోకి కొంగొత్త ఆశలతో అడుగుపెట్టాం. గతం మనకు కొంత మంచిని కొంత చెడును మిగిల్చి ఉండొచ్చు. పాత కొత్త కలయికలను నెమరు వేసుకుంటూ జీవితాన్ని ఆశావహ దృక్పథంతో నిర్మించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. గడిచిన సంవత్సరంలో ఎంతో మందికి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. మరి కొందరికి చేదు అనుభవాలు కూడా ఉంటాయి. చేదు అనుభవాలను గురువుగా భావించి మధుర జ్ఞాపకాలను పాఠ్యాంశాలుగా అనుకుంటే కొత్త జీవితం ప్రగతి మార్గంలో పయనిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలతో ప్రతి మనిషి ముందుకు సాగిపోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకోవడం సహజం. అయితే ఆశకు తగిన కృషి కూడా ఉండాలి. ముఖ్యంగా యువత పరుగులెత్తే వయసులో విజ్ఞానం పేరుతో కొత్తదనం పేరుతో చెడు మార్గంలో పయనిస్తే తమ కుటుంబంతో పాటు సమాజానికి, దేశానికి అపారమైన నష్టం కలుగుతుందనే విషయాన్ని గ్రహించాలి.
మార్కెట్‌లో జోరుగా విక్రయాలు..
2024 వీడ్కోలు, 2025కు స్వాగతం వేళ మార్కెట్‌లో క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. గ్రామాలు మొదలు కొని నంద్యాల పట్టణ వరకు ఎక్కడ చూసినా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ దర్శనమిచ్చాయి. మాంసాహారం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, నర్సరీలు, ఫ్లవర్ దుకాణాలు, స్వీట్స్ షాప్స్, కూల్ డ్రింక్స్, బేకరీల్లో కేక్‌లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ స్పెషల్ ప్యాక్‌లు, ఆకర్షణీయ ఆఫర్లను వ్యాపారులు ప్రకటి ంచారు. సుమారు రూ.80 కోట్ల వరకు క్రయ, విక్రయాలు జరిగి ఉంటాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment