పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మక్తల్: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్‌పర్సన్‌గా గవినోళ్ల రాధమ్మ, వైస్‌చైర్మన్‌గా గణేష్‌కుమార్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పాలమూరు జిల్లాకు చెందిన నాయకుడు.. సీఎం రేవంత్‌రెడ్డి మనకు అండగా ఉన్నారని, మక్తల్ మార్కెట్ యార్డు అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నాయన్నారు. ఏ నాయకుడైనా సరే పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, అప్పుడే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ ఆయన మృతిచెందితే కేసీఆర్ ఎందుకు నివాళులు అర్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేస్తుందని అన్నారు.
సేవ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్మమని, 27 ఏళ్లుగా వారికి సేవ చేసే అవకాశం కల్పించారని అన్నారు. గేట్ల వద్ద కాపలా కాయించుకునే పద్ధతి కాదని నేరుగా ఇంట్లోకి పిలుపించుకొని సమస్యలు పరిష్కారం చేశానని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గవినోళ్ళ రాధమ్మ మాట్లాడుతూ.. అందరి సహకారంతో మార్కెట్‌కు పూర్వ వైభవం తీసుకొస్తానని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, పేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్లు సీతమ్మ, వనజ, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, నాయకులు మల్లప్ప, హన్మంతు, చంద్రకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment