వైజ్ఞానిక ప్రదర్శనలు సాంకేతికతకు తోడ్పాటు
నారాయణపేట ఎడ్యుకేషన్: సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో సాంకేతిక ప్రగతి సాధ్య మవుతుందని.. గ్రామీణ స్థాయి నుంచి నోబెల్ బహుమతులు పొందే స్థాయికి ప్రతి విద్యార్థి ఎదగాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాసీ్త్రయ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవపరమని, పాఠశాలలో విద్యను అభ్యసించే ప్రతి వారికి మెదడుకు మేతలాంటిదని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే శాసీ్త్రయ పరిజ్ఞానంలో మెలకువలు నేర్చుకోవడం వలన ఉన్నత విద్యలో ఉపయోగపడుతుందని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు శాసీ్త్రయ కోణాలలో ఆలోచించి రాబోయే రోజుల్లో నోబెల్ బహుమతులు గెలుచుకొనే దిశగా ఎదగలని సూచించారు. చిన్నప్పటి నుండే విద్యార్థులలో శాసీ్త్రయ పరిజ్ఞానం అలవర్చుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపాద్యాయుల సహకారం ఎంతో అవసరం అన్నారు. అనంతరం విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు ముఖ్య అంశం అయినా సుస్థిర భవిష్యత్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏడు ఉప అంశాలలో వారికి నచ్చిన అంశాలను ఎన్నుకొని ఎంతో అద్భుతంగా ప్రదర్శనలు ప్రదర్శించారు. అంతకుముందు సరస్వతి దేవి, సీవీ. రామన్, సావిత్రిబాయి పూలే చిత్ర పటాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మీ, డీఆర్‌డీఏ పీడీ మొగులప్ప, జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జ్యోతి, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్, మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్, నాయకులువేణుగోపాల్, మధుసూదన్‌రెడ్డి, కోట్ల రవీదర్ రెడ్డి, సతీష్ గౌడ్, ఏఎంఓ విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్రకుమార్, జనార్ధన్ రెడ్డి, శేర్ క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
డీఈఓ గోవిందరాజులు
అట్టహాసంగా జిల్లా స్థాయి
వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment