సైన్స్‌ఫెయిర్ బ్యానర్లపై రగడ
నారాయణపేట: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ బ్యానర్, స్వాగత బ్యానర్లపై సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోవడం ప్రోటోకాల్ రగడకు దారితీసింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం కాగా..ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లపై ప్రొటోకాల్ పాటించలేదని సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని సైన్స్‌ఫెయిర్ ఫోరం సభ్యులను ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున సైన్స్‌ఫెయిర్ జరుగుతుంటే సీఎం ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లాలో సీఎం, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. ఈ బ్యానర్ తీసి కొత్త బ్యానర్ వేయాలని లేదంటే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పట్టుబట్టారు. అనంతరం డీఈఓ, విద్యాశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలంకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదుచేశారు. దీంతో ప్లెక్సీ ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంటే కనీసం జిల్లా ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సమంజసమా అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం ప్రశ్నించారు. త్వరలో ఎమ్మెల్యే ద్వారా సీఎంను కలిసి పేట జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న తతంగాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
బ్యానర్ మార్పు..
ఇదిలాఉండగా, డీఈఓతోపాటు సైన్స్‌ఫోరం సభ్యులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నీకరెడ్డి అందుబాటులో లేకపోవడంతో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో జరిగిన వివిధ జిల్లాలో సైన్స్‌ఫెయిర్ స్టేజీ బ్యానర్ ఫొటోలను చూపిస్తూ.. అక్కడి నుంచి వచ్చిన బ్యానర్ ప్రకారమే తాము ముద్రించి పెట్టాం తప్పా ఇందులో తమ తప్పిదమేమి లేదని చెప్పుకొచ్చారు. సీఎంతో పాటు జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలతో మరో బ్యానర్‌ను ముద్రించి స్టేజీపై ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో ప్రొటోకాల్ సమస్య రాకుండా చూసుకుంటే ఇంత వరకు వచ్చేది కాదని శివకుమార్‌రెడ్డి పేర్కొంటూ.. సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించేందుకు వెళ్లారు.
సీఎం, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల ఆందోళన
అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు
బ్యానర్ మార్చడంతో సద్దుమణిగిన సమస్య
Comments
Please login to add a commentAdd a comment