పొలాలకు వెళ్లలేకపోతున్నాం
చిరుత సంచారంతో రాత్రివేళలో పొలాలకు వెళ్లాలంటనే భయమేస్తోంది. పూసల్‌పహాడ్ గ్రామం సమీపంలోని దట్టమైన గుట్టల నుంచి రాత్రివేళలో పశువులపై దాడి చేసి రెండు లేగదూడలను మట్టుపెట్టాయి. అప్పటి నుంచి చిరుత భయంతో ఇద్దరు, లేక ముగ్గురు చొప్పున రైతులు కలిసి రాత్రి సమయంలో పొలాలకు వెళ్లాల్సి వస్తోంది.
– విష్ణుకాంత్‌రెడ్డి, పూసల్‌పహాడ్
చిరుత చిక్కడంతో బతికిపోయాం
రాకొండ శివారులో చిరుత సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయపడేవాళ్లం. కొన్ని నెలల క్రితం పొలం పనులకు వెళ్తున్న రైతులకు చిరుత అడ్డు రావడంతో వెంటనే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపాం. వారు బోను ఏర్పాటు చేయగా.. అందులో చిరుత చిక్కింది. గ్రామస్తులందరం ఉపిరి పిల్చుకున్నాం.
– నరహరి, రాకొండ
జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుతం మద్దూరు, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో చిరుతల కదలికలను గుర్తించడం జరిగింది. అక్కడ గుట్టల సమీపంలో పలుసార్లు బోన్లు ఏర్పాటు చేశాం. కానీ, చిరుతలు చిక్కడం లేదు. జిల్లాలో ఆరు చిరుతలు ఉన్నట్లు గుర్తించాం. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాం. రైతులు తమ పశువులను రాత్రి సమయంలో పొలాల వద్ద కాకుండా ఇంటి వద్ద కట్టి వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరికై నా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. బోను ఏర్పాటు చేసి పట్టుకుంటాం.
– కమలాద్దీన్, ఎఫ్‌ఆర్‌ఓ, నారాయణపేట
●
Comments
Please login to add a commentAdd a comment