సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లారు. ధరల పెరుగుదల,నిరుద్యోగానికి వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆమె నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే రోడ్డుపై బైఠాయించిన ఆమెను ఐదారుగురు మహిళా పోలీసులు అమాంతం ఈడ్చుకెళ్లారు. వాహనంలో పడేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్టు చేసేందుకు పోలీసులు తన వద్దకు వెళ్లినప్పుడు ప్రియాంక అసలు కదలకపోవడంతో వారు బలవంతంగా ఆమెను లాక్కెళ్లారు.
#WATCH | Police detain Congress leader Priyanka Gandhi Vadra from outside AICC HQ in Delhi where she had joined other leaders and workers of the party in the protest against unemployment and inflation.
— ANI (@ANI) August 5, 2022
The party called a nationwide protest today. pic.twitter.com/JTnWrrAT9T
అంతకుముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆంక్షలు విధించి ఆందోళనలు చేపట్టకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ప్రియాంక బారీకేడ్లపై నుంచి దూకి కార్యకర్తల వద్దకు చేరుకుని నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అరెస్టయ్యారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఢిల్లీలో పార్లమెంటు నుంచి రాష్ట్రపతి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లాలనుకుంది. అయితే పోలీసులు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్యనేతలను విజయ్ చౌక్ వద్ద అరెస్టు చేశారు.
చదవండి: అక్కడ 52 ఏళ్లుగా ఎగరని జాతీయ జెండా.. మోదీ జీ మీరైనా చెప్పండి ప్లీజ్!
Comments
Please login to add a commentAdd a comment