ఖానాపూర్ కోర్టు జడ్జి జితిన్‌కుమార్
ఖానాపూర్: వన్యప్రాణుల సంరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమవుతుందని ఖానాపూర్ కోర్టు జడ్జి జితిన్‌కుమార్ అన్నారు. ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో 70వ వన్యప్రాణి సప్త వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణ ద్వారానే జీవకోటి మనుగడ సాధ్యమవుతుందని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడవచ్చన్నారు. అనంతరం జడ్జి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో కిరణ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, డిప్యూటీ రేంజర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే పరామర్శ
భైంసాటౌన్: రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పి రామారావు పటేల్ ఆయన్ను కలిసి పరామర్శించారు. అంతకుముందు మంత్రి తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట సుభాష్ పటేల్, నాయకులు ఉన్నారు.
‘మంత్రివర్గ ఉప సంఘం రద్దు చేయాలి’
నిర్మల్‌టౌన్: ఎస్సీ వర్గీకరణ అమలు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మాల ఉద్యోగుల జేఏసీ, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసే అంశాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. లేనిపక్షంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందిన వారిని, సంఘాలలో రాష్ట్రస్థాయి పదవులు పొందిన వారిని సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, కొంతం అడెల్లు, గంగారపు రాజేశ్వర్, కుంటోల్ల వెంకటస్వామి, బత్తుల రంజిత్, బొడ్డు లక్ష్మణ్, రాజేశ్వర్, డి.రాములు, ప్రభుదాస్, డాక్టర్ ముఖేష్, డాక్టర్ శ్యామ్, ప్రొఫెసర్ మధు, డాక్టర్ ప్రభాకర్, అడ్వకేట్ లింగయ్య, రవీందర్, పోశెట్టి, అంబకంటి ముత్తన్న, డి.పోశెట్టి, మీరా జగదీశ్వర్, మీరా రాజేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment