ధాన్యం కొనే దిక్కులేదు
● వడ్లకు బోనస్ ఊసే లేదు ● కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేయడం లేదు.. ● రాష్ట్ర ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ మండిపాటు
పత్తి కొనుగోలు కేంద్రాన్ని
పరిశీలించిన బీజేఎల్పీ నేత
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని కేదార్‌నాథ్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామారావుపటేల్ శనివారం పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పత్తిలో తేమ శాతం పరిశీలించారు. వారివెంట జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, భూమయ్య, మండల మాజీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, నాయకులు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, హరినాయక్, సాధం అరవింద్, తదితరులు ఉన్నారు.
సారంగపూర్: అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వరికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధిరంలో ఉన్నా.. వడ్లను కొనడం లేదని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ ఆరోపించారు. మండలంలోని ఆలూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం సారంగాపూర్‌లో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమేందర్ మాట్లాడుతూ హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల విలువైన సమయం మార్కెట్‌ల చుట్టూ తిరగడానికే సరిపోతుందని ఆగ్రహించారు. యాసంగి పనులు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో జాప్యంపై సీసీఐ అధికారులతో మా ట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అవసరమైతే మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న వేబ్రిడ్జిని ఉపయోగించి కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, రావుల రాంనాథ్, విలాస్, రాంశంకర్‌రెడ్డి, చంద్రప్రకాశ్‌గౌడ్, గంగారెడ్డి, పోతన్న, నారాయణ, తిరుమలచారి, చాణక్య, విజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment