క్రీడారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
నిర్మల్‌టౌన్: క్రీడారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం సీఎం కప్– 2024 టార్చ్ రిలే ర్యాలీ నిర్మల్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక మంచిర్యాల చౌరస్తా వద్ద కలెక్టర్, ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ టీం సభ్యులు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తారని, అందులో 4వ జి ల్లా నిర్మల్ కావడం విశేషమన్నారు. గ్రామాల్లో దాగి ఉన్న అథ్లెటిక్ ప్రతిభను గుర్తించి వారికి అవసరమై న శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. గ్రామాల్లోని యువత స్వచ్ఛందంగా క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మా ట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. అనంతరం ర్యాలీ ఆదిలాబాద్‌కు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో సీఎం కప్ ర్యాలీ ఆర్గనైజర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, పేట అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కప్ ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment