అక్రమ కేసులు ఎత్తివేయాలి
భైంసాటౌన్: ఇటీవలి ఘటనలో హిందువులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి భైంసా నా యకులు ఆదివారం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి విన్నవించారు. ఇటీవలి ఘటనపై ఆయనకు వి వరించారు. దీనికి ఆయన స్పందించి.. రెండు, మూడురోజుల్లో కేసులు ఎత్తివేయని పక్షంలో తాను భైంసాకు వస్తానని హామీ ఇచ్చినట్లు వా రు పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు గోపాల్ సర్డా, ని మ్మల ప్రవీణ్, పెండెప్ కాశీనాథ్, తూమోల్ల ద త్తు, శివ, కపిల్ సింధే, శ్రీకాంత్ దగ్డే, లంక గంగాధర్, రావుల రాము, చింతపండు మహేష్, నాగేష్, సుందర్ భయ్యా, ఎం సురేష్, హనుమాన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment