‘అమ్మ’ను చూడాలని..
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర అత్యంత ప్రాశస్తమైనది. విజయదశమికి ముందు వచ్చే శని, ఆదివారాల్లో సాగే జాతరలో స్తానిక ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వయోభేదం లేకుండా అందరూ జాతరలో పాల్గొన్నారు. ఆదివారం దిలావర్‌పూర్ మండలంలోని సాంగ్విలో పోచ మ్మ నగలు శుద్ధి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఓ వృద్ధురాలిని తన మనవడు ఎత్తుకుని వచ్చిన దృశ్యం చూపరులను కదిలించింది. ముదిమి వయసులో భక్తి తన్మయత్వంతో తల్లిని దర్శించుకునేందుకు వచ్చిన దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment