ధ్వంసమైన కారు అద్దాలు
బాన్సువాడ: బుడ్మి గ్రామంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమ అయ్యాయి. గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు కొట్టారని ఏనుగు రవీందర్‌రెడ్డికి సమాచారం అందడంతో అర్ధరాత్రి ఒంటి గంటకు గ్రామానికి వెళ్లారు. బీఆర్‌ఎస్ నాయకులే పోలీసులకు సమాచారం ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు కొట్టించారని రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని వ్యక్తులు రవీందర్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు.
శెట్పల్లిసంగారెడ్డిలో లాఠీచార్జి
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో గురువారం జరిగిన లాఠీచార్జిలో పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. పోలింగ్ బూతు వద్ద ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసే ప్రదేశంలో ఓటర్లు గుమిగూడడంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు లాఠీచార్జ్ చేశారు. గుంపులుగా గుమిగూడడంతో పలుమార్లు జనాలు అక్కడి నుంచి వెళ్లాలని హెచ్చరించినా వినిపించుకోకకపోవడంతో లాఠీచార్జి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులకు గాయాలయ్యాయి.
హజ్గుల్‌లో ఘర్షణ
బిచ్కుంద: హజ్గుల్‌లో పోలింగ్ కేంద్రం స మీపంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నా రని ఒకరిపై ఒకరు ముగ్గురు పార్టీల కార్యకర్తలు వి మర్శలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు చేరుకొని గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment