బాల్కొండ: మెండోరా మండలం దూదిగాంలో ఓ చిన్నారి అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గ్రామంలో చిత్తు కాగితాలు ఏరుకుంటు జీవనం సాగిస్తున్న పోసాని కూతురు చిన్నారి అదృశ్యమైందని అన్నారు. రెండు రోజుల క్రితం భిక్షాటనకు వెళ్లిన చిన్నారి తిరిగి రాలేదన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గేదెను ఢీకొని ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డిరూరల్: పట్టణ శివారులో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గేదెను ఢీకొనడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. నాగిరెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డి వైపునకు వెళ్తున్న సాయిలు దేవునిపల్లి గ్రామ శివారులో అకస్మాత్తుగా వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్ర గా యాలైనట్లు వారు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
రెంజల్‌లో వాహనాల తనిఖీ
రెంజల్: మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ బుధవారం తెలిపారు. స్కూల్ బస్సులు, లారీలు, ఆటోలు, జీపులు, కార్లను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను జప్తుచేసినట్లు చెప్పారు. వాహనదారులు తమవెంట ధ్రువీకరణపత్రాలు ఉంచుకోవాలని సూచించారు. తనిఖీలో పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment