130 కిలోల పటిక, బెల్లం పట్టివేత
కామారెడ్డి క్రైం: రైలులో అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల పటిక, బెల్లంను కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎకై ్సజ్, ఆర్పీఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యాహ్నం దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు కామారెడ్డికి చేరుకోగానే తనిఖీలు చేపట్టారు. 100 కిలోల బెల్లం, 30 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్నది ఎవరనేది తెలియలేదు. కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్ తెలిపారు.
ఆర్మూర్‌లో చైన్ స్నాచింగ్
ఆర్మూర్‌టౌన్: మామిడిపల్లి సమీపంలో గురువారం రాత్రి స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దొంగలు బంగారు గొలుసును ఘటన చోటు చేసుకుంది. పెర్కిట్‌లోని తిరుమల కాలనీకి చెందిన సింగారం లలిత కొడుకుతో కలిసి అర్గుల్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మామిడిపల్లి సమీపంలో దుండగులు పల్సర్ బైక్‌పై వెనుక నుంచి మెడలో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment