మహారాష్ట్ర పర్యటనకు పసుపు రైతులు
జక్రాన్‌పల్లి: మండలంలోని మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేపీఎం పసుపు ఉత్పత్తిదారుల సంఘం రైతులు నాసిక్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. గురువారం మనోహరాబాద్‌లో మండల వ్యవసాయ అధికారిణి దేవిక జెండా ఊపి నాసిక్ సందర్శన యాత్రను ప్రారంభించారు. వీరు మహారాష్ట్రలోని హింగోళి వద్ద దత్తగురు రైతు ఉత్పత్తిదారుల సంఘం, నాసిక్‌లోని సైయాద్రి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించనున్నారు. అక్కడ రైతు ఉత్పత్తిదారుల సంఘాల నిర్మాణం, బలోపేతం, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలు తెలుసుకోవడానికి వెళ్లినట్లు సంఘం డైరెక్టర్ పాట్కురి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మనోహరాబాద్, కలిగోట్, పడకల్, జక్రాన్‌పల్లి, మైలారం గ్రామాల్లోని 45 మంది రైతులు సందర్శనకు వెళ్లారు. సందర్శనకు వెళ్లిన వారిలో సంఘం డైరెక్టర్లు అల్లూరి సంతోష్, వెల్మ సంతోష్, గడ్డం శ్రీనివాస్, భోజన్న, నాగేశ్, రాజు, గడ్డం లక్‌పతిరెడ్డి, రైతులు ఉన్నారు.
డబ్బుల బ్యాగ్ బాధితురాలికి అందజేత
రుద్రూర్: బస్సులో డబ్బులతో ఉన్న బ్యాగును బాధితురాలు మరిచిపోయి పోలీసులను ఆశ్రయించగా, ఆ బస్సును వెంబడించి రూ. 40 వేల నగదు, బంగారాన్ని బాధితురాలికి అప్పగించిన ఘటన రుద్రూర్‌లో గురువారం జరిగింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం కారేగాం గ్రామానికి చెందిన నరహరి లలిత అనే మహిళ బాన్సువాడ నుంచి బస్సులో వచ్చి రుద్రూర్ దిగింది. డబ్బులు ఉన్న బ్యాగు కనపడక పోవడంతో బస్టాండ్ పరిసరాల్లో ఉన్న పోలీసులను ఆశ్రయించింది. వారు వెంటనే బస్సును వెంబడించి బోధన్‌లో ఆపి తనిఖీ చేశారు. బ్యాగు దొరకడంతో రుద్రూర్ పీఎస్‌లో బాధితురాలికి అప్పగించారు. బాధితురాలు సమస్యను చెప్పగానే వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ సురేశ్, పోలీస్ కానిస్టేబుల్ గజేందర్, డ్రైవర్ శ్రీనివాస్‌ను ఎస్సై అభినందించారు.
విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని దుబ్బ ఉన్న త పాఠశాలలో ఓ విద్యార్థినిని టీచర్ కొట్టడంతో తల్లిదండ్రులు గురువారం ఆందోళన చేశా రు. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అశ్విత ఈ నెల 7న పాఠశాల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లింది. దీంతో మరుసటి రోజు అలా ఎందుకు వెళ్లావంటు గణితం టీచర్ విద్యార్థిని చేతిపై తీవ్రంగా కొట్టింది. దీంతో జరిగిన విషయాన్ని ఇంటికి వ చ్చాక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి టీచర్‌తో వాగ్వాదానికి దిగారు. గురువారం మళ్లీ సదరు విద్యార్థిని చేతిపై తీవ్రంగా టీచర్ కొట్టడంతో చేతి విరిగిందని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఘటన జరిగిన మొదటి రోజే ఎంఈవో వెంకట్‌నారాయణగౌడ్ విచార ణ చేపట్టారు. విద్యార్థినిపై టీచర్ తీవ్రంగా కొట్టినట్లు ఆధారాలు లేవని తెలిసింది. ఈ ఘటనపై మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు విచారణ చేపట్టారు. మూడో టౌన్‌లో ఈ ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కా గా పాఠశాల గణితం టీచర్‌ను వివరణ కోరగా విద్యార్థినిని తీవ్రంగా కొట్టలేదని తెలిపారు.
స్థల పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం మండలంలో పర్యటించారు. జు వ్వాడి శివారులో నిర్మించ తలపెట్టిన స్టేడియం స్థలాన్ని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. రికార్డులు, స్టేడియం నిర్మించే స్థల విస్తీర్ణం రికార్డులో పక్కాగా పొందుపర్చా లని సూచించారు. అనంతరం జువ్వాడి గ్రా మాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment