ఉపాధి కోర్సులపై దృష్టి కేంద్రీకరించాలి
మోపాల్(తెయూ): విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేపట్టి ఉపాధి కోర్సులపై దృష్టి కేంద్రీకరించాలని తెయూ వైస్ చాన్స్‌లర్ యాదగిరిరావు సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని తెయూలో జంతుశాస్త్ర విభాగం విద్యార్థులకు సెరికల్చర్, కేంద్రీయ పట్టు పరిశ్రమ బోర్డు ఆధ్వర్యంలో మూడుఎ రోజుల పాటు ఇచ్చిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ గురువారంతో ముగిసింది. శిక్షణలో విద్యార్థులకు మల్బ రీ కల్చర్, పట్టు రోలింగ్ విధానం, చాకి గుడ్ల ఉత్ప త్తి కేంద్రం నిర్వహణ, గుడ్ల ఉత్పత్తి విధానం, పో లింగ్ విధానంలో ఆధునిక యంత్రాల నిర్వహణపై క్షేత్రస్థాయి అనుభవాలు, మార్కెటింగ్ పద్ధతులను వివరించారు. నేషనల్ సిల్క్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ యాదవ్, టెక్నికల్ ఆఫీసర్ రాఘవేంద్ర, హా ర్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సెరికల్చర్ ఆఫీసర్ ఐలయ్య, రిసోర్స్‌పర్సన్లుగా వ్యవహరించారు. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాల ను వీసీ అందజేశారు. కార్యక్రమంలో జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ప్రసన్నశీల, ప్రొఫెసర్లు సునీల్‌కుమార్, విజయ్‌కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment