గోవులను రక్షించాలి
నిజామాబాద్ రూరల్: ప్రతిఒక్కరూ గోవులను రక్షించాలని, వాటిని రక్షితే హిందూ ధర్మాన్ని రక్షించడమే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. గోరక్ష మహా పాదయాత్రలో భాగంగా గురువారం నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు గోమాతతో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర గోరక్షణ సంఘ సభ్యులు బాలకృష్ణ గురుస్వామి గోరక్ష మహా పాదయాత్రలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 77రోజుల పాటు 9రాష్ట్రాలు కలుపుకుంటు 2500వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ముందుగా గోవులను రక్షించి వాటిని సంరక్షించాలన్నారు. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు హరిదాసు స్వామిజీ, ధాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment