సమయ పాలన పాటించాలి
నిజామాబాద్‌అర్బన్: సమీకృత జిల్లా కార్యా లయాల సముదాయం(కలెక్టరేట్)లోని ఆ యా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్‌కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాల్లో అధికారుల, సిబ్బంది హాజరును పరిశీలించారు. సమయ పాలన పాటించాలని సూ చించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏవో ప్ర శాంత్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల కు మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేసినట్లు డీఈవో అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 8వ తరగతికి వరకు రూ.1,88,90,679, అలాగే సీసీహెచ్‌ల గౌరవ వేతనం రూ.69,58,000 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మండలాల వారీగా ఎంఈవోల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
బోర్డు నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్ బోర్డు నిబంధనలను అతిక్రమిస్తే కళాశాలలపై చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలను గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. విద్యార్థులను డాటాను సరి చూసుకునేందుకు, సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫొటో, సంతకం తప్పుదొర్లితే సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించిందని, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించా రు. తప్పిదాలు దొర్లితే విద్యార్థుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కళాశాలల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ సూచించిన మేరకు ప్రణాళికాబద్ధంగా బోధన, నిర్వహణ జరగాలని ఆదేశించారు.
నాణ్యమైన సోయా
విత్తనాలు అందిస్తాం
వేల్పూర్: రాష్ట్ర రైతాంగానికి నాణ్యమైన సో యా విత్తనాలను అందిస్తామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి అన్నారు. వానాకాలం సీజన్‌లో అవసరమయ్యే లక్ష క్వింటాళ్ల విత్తనాల కోసం సీడ్ కార్పొరేషన్ అధికారులతో కలిసి బుధ, గురువారాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అన్వేష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు విత్తనాభివృద్ధి సంస్థను మిగతా రాష్ట్రాల అనుబంధంతో దేశంలో ముందంజలో ఉంచేందుకు ఇండోర్, భోపా ల్ ప్రాంతాలను సందర్శించామన్నారు. మ ధ్యప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనే జింగ్ డైరెక్టర్, అధికారులతో సమావేశమై సోయాబీన్ విత్తన ఆవశ్యకత, తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు శనగ, జొన్న, సజ్జ విత్తనాల సరఫరాపై చర్చించామన్నారు. ఇండోర్‌లోని విత్తన శుద్ధి కర్మాగారాన్ని సందర్శించి విత్తన నాణ్యత, ప్యాకింగ్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు.
రేపు హ్యాండ్ బాల్
జిల్లా జట్టు ఎంపిక
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ బాలుర వి భాగంలో ఈ నెల 14న మాక్లూర్ మండలం కల్లెడ జెడ్పీ స్కూల్‌లో ఎంపికలు ఉంటాయ ని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగామోహన్ చక్రు, సురేందర్ గురువారం పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించే పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9642535535, 9440441757 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment