సర్వేలో తప్పిదాలకు తావివ్వొద్దు
పెర్కిట్(ఆర్మూర్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదా లకు తావివ్వొద్దని, అర్హులకు లబ్ధి చేకూరేలా యా ప్‌లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్, ఇస్సాపల్లి గ్రామాల్లో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన, పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఒక్కో దరఖాస్తుదారుని వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించారు, ఆన్‌లైన్‌లో ఎన్ని అప్‌లోడ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గజానంద్, ఎంపీడీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎంపీవో శ్రీనివాస్ తదితరులున్నారు.
అర్హులకు లబ్ధి చేకూర్చాలి
శిథిలావస్థలోని ఇళ్లలో ఉంటున్న వారి వివరాలనూ సేకరించాలి
అధికారులకు కలెక్టర్
రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment