13 లోక్ అదాలత్ బెంచ్‌ల ఏర్పాటు
ఖలీల్‌వాడి: రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ సునీత కుంచాల కోరారు. జిల్లా కోర్టులోని తన చాంబర్‌లో న్యాయమూర్తి గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 14న లో క్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 13 బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్, ప్ర భుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకుల రుణాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు ఆర్థికలబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే గృహహింస, మెయింటెనెన్స్ కేసులు రాజీ చేసుకోచ్చని తెలిపారు. కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే నూతన పరిష్కార వేదిక అత్యుత్తమమని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న అని రకాల కేసులకు శాశ్వత చట్టబద్ధత కలిపిస్తూ అవార్డులు జారీ చేస్తామని, పై కోర్టుల్లో అప్పీలుకు వీలు ఉండదని తెలిపారు. లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు పౌరసమాజం సహాయసహకారాలు అందించాలని కోరారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్
కోర్టుల్లో ఏర్పాట్లు
రాజీపడదగిన కేసులను
పరిష్కరించుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సునీత కుంచాల
Comments
Please login to add a commentAdd a comment