31లోగా ధాన్యం డబ్బులు చెల్లించాలి
సుభాష్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం 2022–23 యాసంగిలో నిర్వహించిన టెండర్ ధాన్యం డబ్బులను రైస్‌మిల్లర్లు ఈనెల 31వ తేదీలోపు చెల్లించాలని రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ శశిధర్ రాజ్ ఆదేశించారు. గురువారం నగరంలోని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో టెండర్ ధాన్యానికి సంబంధించిన రైస్‌మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2022–23 సంవత్సరం యాసంగి ధాన్యానికి టెండర్ నిర్వహించిందని అన్నారు. లాట్ నంబర్ 1, 2, 12కు సంబంధించి రైస్‌మిల్లర్లు ప్యాడీ డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈనెల 31 లోపు డబ్బులు చెల్లించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నగర శివారులోని కాలూరు, ఖానాపూర్‌లో ఉన్న పలు రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ధాన్యం వివరాలు, సీఎంఆర్ రికార్డులను పరిశీలించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. సీఎంఆర్ సకాలంలో చెల్లించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, డీఎం అంబదాస్ రాజేశ్వర్, ఏసీఎస్‌వో రవి రాథోడ్, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్
శశిధర్ రాజ్
Comments
Please login to add a commentAdd a comment