డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
నిజామాబాద్ అర్బన్: ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన బాపూజీ వచనాలయాన్ని డి జిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమ ని వచనలయ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం అన్నారు. నూతన కమిటీ సభ్యులు గురువా రం ప్రమాణ స్వీకారం చే శారు. ఈ సందర్భంగా భక్తవత్సలం మాట్లాడుతూ.. బాపూ జీ వచనాలయం పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వేదికగా ఉంటూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతోందన్నారు. అన్ని వర్గాల ప్ర జలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి మీసాల సుధాకర్‌రావు, కోశాధికారి బి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షులు భవంతి దేవీదాస్, బోగ అశోక్, సంయుక్త కార్యదర్శులు సాంబయ్య, దత్తాత్రి, కార్యవర్గ సభ్యులుగా లక్కంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment