అంతా కుమ్మక్కయ్యారు.. | - | Sakshi
Sakshi News home page

అంతా కుమ్మక్కయ్యారు..

Published Sat, Dec 14 2024 1:21 AM | Last Updated on Sat, Dec 14 2024 1:21 AM

అంతా కుమ్మక్కయ్యారు..

అంతా కుమ్మక్కయ్యారు..

22 రోజుల్లో ..

రిజిస్ట్రేషన్‌ శాఖలో నాలుగు నెలల క్రితం బదిలీలు చేపట్టారు. సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు బదిలీ అ య్యారు. జోన్‌ పరిధిలోని ఆదిలాబాద్‌, నిర్మ ల్‌, జగిత్యాల్‌ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చా రు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన రివ్యూలో 257 సర్క్యూలర్‌ను పాటించాల్సిందేనని ఆదేశించారు. అప్ప టి నుంచి నాన్‌ లేవుట్‌, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్నుల రషీదులతో పాటు ప్లాట్‌ను విభ జించి రిజిస్ట్రేషన్లు చేయడం నిలిపివేశారు. నా లుగు నెలలుగా డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డాక్యుమెంట్లు పక్కనపెట్టారు. సబ్‌ రిజిస్ట్రార్‌పై డాక్యుమెంట్‌ రైటర్లు నిరసనకు దిగారు. తొమ్మిది రోజులు కార్యలాపాలకు ఆటంకం కలిగించారు. పదో రోజు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వచ్చాడు. దాంతో డాక్యుమెంట్‌ రైటర్ల పని యథావిఽధిగా మా రింది. వారి అక్రమాలకు హద్దులు లేకుండా పోయింది. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంటన్నింటినీ వరుసగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆ దాయానికి భారీగా గండి పడుతోంది. నవంబ ర్‌ 20 నుంచి డిసెంబర్‌ 12 వరకు 22 రోజుల్లో రికార్డుస్థాయిలో 650 పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్ల లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మా రా యని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కా ర్యాలయంలో సీన్‌ రివర్సయింది. పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు డాక్యుమెంట్‌ రైటర్లు వర్సెస్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఉండగా, నేడు పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. హాట్‌ సీటు పై డీఐజీ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కన్నేశా డు. ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. డాక్యుమెంట్‌ రైటర్లకు కొరకరాని కొయ్యగా మారిన సబ్‌ రిజిస్ట్రార్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్న తరుణంలో సదరు అధికారి వీరికి దగ్గరయ్యారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు లేనిపోనివి నూరి పోశాడు. చివరకు ఆ నిఖార్సైన సబ్‌ రిజిస్ట్రార్‌ను సెలవుల్లో వెళ్లే లా చేశాడు. ఆ సీటుపై కన్నేసిన అధికారికే ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతా కుమ్మకై ్క రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో దోపిడీకి తెర లేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏం చేసినా అడిగేవారు లేకుండాపోయారు. డాక్యుమెంట్‌ రైటర్లు, వారి అసిస్టెంట్లుకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాడు. బ్రోకర్లు కార్యాలయంలోకి దర్జాగా వస్తున్నారు. పనులు చక్కబెట్టుకుంటున్నా రు. బయటి వ్యక్తులెవ్వరూ లోపలికి రావద్దన్న నిబంధనలను పక్కనపెట్టారు. వారితో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో వారిని ఆపడానికి ఎవరూ సాహసించడంలేదు. డీఐజీ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కావడం వల్ల జిల్లా రిజిస్ట్రార్‌ సైతం ఆయన అక్రమార్జనను చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

డీఆర్‌ సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జిగా సబ్‌ రిజిస్ట్రార్‌–1 కిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయ న కూడా నాలుగైదు రోజుల క్రితమే సబ్‌ రిజిస్ట్రార్‌–1గా బాధ్య తలు స్వీకరించారు. కార్యాలయంలో జరుగుతున్న తతంగాన్ని ఆయనేం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని కార్యాలయంలో గుసగుసలాడుతున్నారు. స్వార్థం మేరకు ఏకంగా డీఐజీ పేరు కూడా వాడుతున్నట్లు వినికిడి.

రిజిస్ట్రేషన్‌ శాఖలో దోపిడీ పర్వం !

డాక్యుమెంట్‌ రైటర్లు, ఇన్‌చార్జి సబ్‌

రిజిస్ట్రార్‌లు ఒక్కటయ్యారు

పెండింగ్‌ డాక్యుమెంట్లన్నింటికీ రెక్కలు

‘డీఐజీ’ పేరు చెప్పుకుని చక్రం తిప్పుతున్న సదరు ఇన్‌చార్జి అధికారి

అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో

పర్యవేక్షణ లేమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement