ఎస్సారెస్పీలో పూడికతీస్తాం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీతకు చర్యలు చేపడుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ముప్కాల్ మండల కేంద్ర శివారులోని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంపు హౌజ్ వద్ద నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదట్లో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక పేరుకుపోయి ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ప్రపంచంలోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్సారెస్పీలోని పూడికను తొలిగించి తిరిగి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి తీసుకువస్తామన్నారు. పూడిక తొలగింపుపై కేంద్ర ప్రభుత్వంతో కూడ చ ర్చించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పూడిక తీతకు 50 శాతం నిఽ దులు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం భారత దేశంలోనే గొప్ప చారిత్రక కట్టడమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్సారెస్పీతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 20, 21, 23, 27 పనులు ఇప్పటి వరకు పూర్తయిన నుంచి ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రధానంగా 21 ప్యాకేజీ పనులు పూర్తి చేసి బాల్కొండ, నిజామాబాద్ రూ రల్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు
ఇరిగేషన్ శాఖలోని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరిగేషన్ శాఖలో అనేక మా ర్పులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 700 ఏఈఈ పోస్టులను, 1800 లష్కర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించామన్నారు. యూపీఎస్సీ ద్వారా మరో 1300 పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీటిని వినియోగించకుండానే రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో వానా కాలంలో వరి పంటను సాగు చేసి 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే రైతు ప్రభుత్వమన్నారు. ప్రాజెక్టులకు, లిఫ్టులకు మెయింటెనెన్స్ కోసం నిధులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తె లంగాణ ప్రజలపై భారం మోపి రూ. లక్షల కోట్లల్లో అప్పులు చేసిందన్నారు. ప్రస్తుతం వడ్డీలు చెల్లించలేక పోతున్నామన్నారు. ఇరిగేషన్ వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కొన్ని సంస్కరణలకు సిద్ధమవుతున్నామన్నారు. రైతు రుణ మాఫీ త్వరలోనే పూర్తిగా చేస్తామన్నారు. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. నేషనల్ డ్యాం సెఫ్టీ బృందం అన్నారం, మేడిగడ్డ, కాళేశ్వర్ డ్యాంల ద్వారా నీటి సరఫరాకు ప్రస్తుతం అనుమతివ్వలేమని లిఖిత పూర్వకంగా తెలిపిందన్నారు. సమావేశంలో బోధన్, నిజామాబాద్ రూరల్, జుక్క ల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మికాంతారావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఈఎన్‌సీ సుధాకర్, బాల్కొండ, అర్మూర్ నియోజక వర్గాల కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జులు ముత్యాల సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి , ప్రా జెక్టు అధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొస్తాం
ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 20, 21
పనులను పూర్తి చేస్తాం
భారీ నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment