పండుగలా నిర్వహించాలి
● డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై కలెక్టర్ వీసీ సమీక్ష●
● ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్‌అర్బన్/బాల్కొండ: ఈనెల 14న నిర్వహించనున్న సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్సారెస్పీ పర్యాటనతో శుక్రవారం కలెక్టర్‌కు ప్రాజెక్ట్ వద్దనే సమ యం గడిచిపోవడంతో బాల్కొండ మండల కేంద్రంలోనే ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శా ఖల జిల్లా అధికారులు, ఆర్సీవోలు, ఎంపీడీవోలు, తహ సీల్దార్లతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ గురుకులాలు, హాస్టల్‌లలో 40శాతం డైట్, 200శాతం కాస్మెటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ గురుకులాలు, వసతి గృహాలలోని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి భోజనం చేస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పాఠశాలల తనిఖీ, మధ్యాహ్నం 12గంటల నుంచి 12.30 గంటల వరకు విద్యార్థులతో ఇష్టాగోష్టి, సాంస్కతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట వరకు కామన్ డైట్ బ్యానర్ ఆవిష్కరణ, హ్యాండ్ బుక్ విడుదల, ముఖ్య అతిథి ప్రసంగం, 1గంటల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భోజనాన్ని పరిశీలించి, ఏవైనా సమస్యలు గుర్తిస్తే వాటిని పొందుపరుస్తూ తనకు నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో పనులు చేయించకూడదని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సమీక్ష
ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించా రు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా వాస్తవ వివరాలను సేకరిస్తూ మొబైల్ యాప్‌లో పొందుపరచాలని సూచించారు. ప్రస్తుతం సేకరించే వివ రాలు వచ్చే నాలుగేళ్ల పాటు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనున్నందున సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment