క్రైం కార్నర్
దుబాయ్‌లో గుండెపోటుతో
మాక్లూర్ వాసి మృతి
మాక్లూర్: బతుకుదెరువు కోసం మండల కేంద్రం నుంచి దుబాయ్ వెళ్లిన ఫారత్ (40) శనివారం గుండెపోటు వచ్చి మృతిచెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఫారత్ 15 రోజుల క్రితమే దుబాయ్ వెళ్లాడని, ఇంతలోనే అతడు గుండెపోటుతో మృతి చెందాడన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆదివారం విలపిస్తూ చెప్పారు. ఆయనకు భార్య, పాప ఉన్నారు. మృతదేహన్ని స్వగ్రామానికి త్వరగా రప్పించాలని అధికారులు, నాయకులను కోరుతున్నారు.
టిప్పర్ పట్టివేత
రెంజల్(బోధన్): మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను శనివారం సాయంత్రం పట్టుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. నీలా చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా టిప్పర్ రావడంతో నిలిపివేసి ధ్రువపత్రాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇసుకకు సంబంధించి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్‌కు అప్పగించినట్లు వివరించారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో 12మందిపై కేసులు
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. అలాగే వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా 12మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి ఎవరైనా వాహనం నడిపితే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఎస్సై షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment