పట్వారీకి అరుదైన గౌరవం ●
● 50 ఏళ్లపాటు జాతీయ జెండా
ఆవిష్కరణ
బోధన్: బోధన్ పట్టణానికి చెందిన డీసీ సీబీ మాజీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ ప్రజాప్రతినిధిగా 50 ఏళ్లకు పైగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన బోధన్ ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. 1962 నుంచి 1981 వరకు, 1985–1991, 1995 నుంచి 2020 వరకు సంఘ అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి 2020 వరకు నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగారు. 50 ఏళ్లుగా పైగా ఆయన జెండా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
రిపబ్లిక్ డే ఏర్పాట్ల
పరిశీలన
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఉద యం 9 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
నాణ్యమైన భోజనం
అందించాలి
వర్ని: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోధన్ కోర్టు మేజిస్ట్రేట్ సాయిశివ సూచించారు. శనివారం వర్ని మండలం కోటయ్య క్యాంపులోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు, హాస్టల్ ని ర్వాహకులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. వర్ని ఎస్సై రమేశ్, ఏఎస్సై నాగభూషణం పాల్గొన్నారు.
నీటి సంఘాలు
ఏర్పాటు చేయాలి
నిజామాబాద్ సిటీ: స్థానిక రైతులతో నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ కోరా రు. కమిషన్ సభ్యులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. మైనర్ ఇరిగేషన్‌ను మేజర్ ఇరిగేషన్ నుంచి విడదీసి అభివృద్ధి చేయాలని కోరారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీరెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్ ఉన్నారు.
వర్గీకరణ పోరాటంలో భాగస్వాములు కావాలి
నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ వర్గీకరణ చేపట్టా లని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న నిర్వహించే లక్ష డప్పులు – వెయ్యి గొంతులు సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదిగ పిల్లలు బాగు పడాలంటే పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. వర్గీకరణను అడ్డుకునే శక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయొద్దన్నారు. నాయకులు సరికెల పోశెట్టి, కనక ప్రమోద్, మైలారం బాలు, సురేష్, నాగభుషణం, సంతోష్, యాద య్య, రాజేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment