రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..
బాల్కొండ: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో కమిటీ సభ్యులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలో 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిక్లరేషన్‌ల పేరుతో హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు వారు వచ్చి రాష్ట్రంలో ఎన్ని హామీలు అమలు అవుతున్నాయో పరిశీలించాలని కోరారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుంటే ఎంపీ అర్వింద్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ కమిషన్‌కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందిస్తామన్నారు. రైతులో రాజును చూసిన కేసీఆర్‌ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. రైతుల తరఫున నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జోగు రామన్న, సత్యవతి రాథోడ్, అంజయ్య, రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఏడాదిలో 409 మంది
అన్నదాతల బలవన్మరణం
బీఆర్‌ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment